![]() |
![]() |
.webp)
డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఆడియన్స్ ని బాగా అలరిస్తోంది. ఈ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హార్విన్ అనే చిన్నారి చారీ గెటప్ లో వచ్చి రోజాకు జాతకం చెప్తాడు. ఇక ఆ కుర్రాడి మాటలు మాములుగా లేవు చాలా క్యూట్ గా ఉన్నాయి. "అందరూ జాబిలిని చూస్తారు కానీ నేను జాబిలికే జాతకం చూస్తున్నా" అని చెప్పాడు ఆ చిన్నారి. దాంతో రోజా ఐతే ఆ పిల్లాడి మాటలకు ఫిదా ఐపోయింది. ఆ చిన్నారినే చూస్తూ కూర్చుంది. దాంతో ఆ పిల్లాడు రోజా జాతకం చెప్పాడు. "త్వరలోనే మినిస్టర్ గా" అన్నాడు. దానికి రోజా వెంటనే "ప్రమాణ స్వీకారం చేస్తానా" అని అన్నది. కాదు త్వరలోనే మినిస్టర్ గా సినిమా చేయబోతున్నారు అని చెప్పాడు.
ఇంతలో సుధీర్ వచ్చి "మరి నాకు కూడా జాతకాలు చెప్పాలి కదా" అన్నాడు. "నీ జాతకంలో ప్రాణగండం ఉంది నాయనా" అన్నాడు ఆ చిన్నారు. వెంటనే సుధీర్ "ప్రాణగండం పోవాలంటే ఎం చేయాలి" అని అడిగాడు. "అమ్మాయిలకు దూరంగా ఉండు నాయనా" అని పరిహారం చెప్పాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఇక ఫైనల్ గా షోకి వచ్చిన జగపతి బాబు , రోజా, ఆమని వచ్చారు. జగపతి నటించిన సినిమాలకు సంబంధించిన పిక్స్ చూపించి గెస్ చేయమని సుధీర్ అడిగాడు. ఫైనల్ గా ఇచ్చేయండి ప్రైజ్ ఆమెకే ఇచ్చేయండి. "ఈ రాక్షసితో ఎక్కడ పెట్టుకుంటాం" అంటూ రోజాను ఉద్దేశించి జగపతి బాబు కామెంట్ చేసాడు. ఇక ఈ ముగ్గురూ కలిసి చాలా మూవీస్ లో నటించారు. జగపతి బాబు నటించిన సినిమాలను రోజా టకాటకా చెప్పేసింది చాలా మెమరీ అంటూ ఆమని కూడా పొగిడేసింది. అప్పుడు రోజా "ఏమీలేదు మళ్ళీ టాస్క్ లో ఆన్సర్స్ చెప్పి శుభలగ్నం సినిమాలోలా జగపతి బాబును మళ్ళీ గెలుచుకుందామని" అంటూ చెప్పింది రోజా.
![]() |
![]() |